హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని వివిధ రాష్ట్రాల ఎన్నారైలకు వివరిస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో వివిధ దేశాల ఎన్నారై ప్రతినిధులతో ఆన్లైన్లో సమావేశమై బీఆర్ఎస్ ఎజెండాను వివరిస్తామమని పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణ మాడల్ ఖాయమని, దీనికి బీఆర్ఎస్ ఖమ్మం సభ విజయవంతమే నిదర్శమని పేర్కొన్నారు. ఇది 2024 నవశకానికి నాంది కాబోతుందని, బీఆర్ఎస్ దేశవ్యాప్త విస్తరణకు ప్రేరణగా నిలస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అంధకారంలోకి వెళ్లిందని ఆరోపించారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ప్రజలందరూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు. ప్రజాభిమానమే కేసీఆర్కు ఉన్న కొండంత బలమని పేర్కొన్నారు.