హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో 317 జీవో అమలు సందర్భంగా జరిగిన లోపాలను సవరిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చినట్టు టిగారియా యూనియన్ నేతలు వెల్లడించారు.
సోమవారం అడ్లూరి లక్ష్మణ్‌ను టిగారియా నేతలు కలిశారు. 317 జీవో అమలులో జరిగిన అవకతవకలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.