హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో ఖాళీకానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేస్తామని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఓటరు నమోదు కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్, దర్శన్‌గౌడ్, సాహితీ, రోషన్, చంద్రకాంత్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.