హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా ప్రొఫెసర్ కే జయశంకర్ జీవితాన్ని గడిపారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించు కున్నారు. ఆ మహనీయుడి త్యాగాన్ని తెలంగాణ సమా జం సదా గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఆయన ఉద్య మస్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు.