ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : భాగ్యనగర్ టీఎన్జీవో-గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషిచేస్తామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రకటించా రు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నదని, త్వరలో ఇండ్ల స్థలాలిప్పిస్తామని భరోసా కల్పించారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని సొసైటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన బుధవారం ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
టీడీపీ నాయకుడు టీడీ జనార్దన్
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని టీడీపీ నాయకుడు టీడీ జనార్దన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ టీడీపీని స్థాపించిన చోటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.
సైబర్ నేరాలపై వృద్ధులకు అవగాహన
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల్లో అత్యధిక శా తం బాధితులు వృద్ధులే కావడంతో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘జాగరూక్ సీ నియర్ సిటిజన్ దివస్’ అనే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిం ది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమం బుధవారం తో ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యం లో వివిధ సీనియర్ సిటిజన్ సంఘాలు, జిల్లా సమన్వయ కమిటీల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించింది. సం ఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 మంది సీనియర్ సిటిజన్లను ఆహ్వానించి సైబర్ సామ్‌ను గుర్తించడం, నేరస్తుల నుంచి తమను తాము రక్షించుకోవడంపై వివరించారు. అనంతరం సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అరుణాచలం గిరిప్రదక్షిణకు టూర్ ప్యాకేజీ
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కార్తీకపౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం టీజీఆర్టీసీ ప్ర త్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక టూర్ ప్యాకేజీని సంస్థ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధివినాయక స్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్టెంపుల్ను సందర్శించే సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తున్నది.ఈ నెల 15న కార్తీకపౌర్ణమి కాగా.. 13 నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయల్దేరుతాయి. అరుణాచలగిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని http//tgsrtcbus.inవెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం,వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు స్పెషల్ బస్సులను నడిపిస్తున్నట్టు ఎండీ సజ్జనార్ పేరొన్నారు. ఇక దీపావళి సందర్భంగా టికెట్ ధరలను జీవో ప్రకారం సవరించినట్టు స్పష్టంచేశారు.