హైదరాబాద్ (సిటీబ్యూరో), ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఉన్నదని, ఎన్నో ఏండ్ల నుంచి తాము చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర జనాభాకు అనుకూలంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ కార్మికులు అరకొర జీతాల తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభు త్వ ఉద్యోగులతో సమానంగా వీరికి జీతాలు ఇ వ్వాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని వెల్లడించారు. దళితుల వద్ద ఉన్న అసైన్డ్ భూములకు రెగ్యులర్ పట్టాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ప్రొఫెసర్ పురుషోత్తం, యతాకుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.