హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తేతెలంగాణ): లగచర్లలో ఫార్మా విలేజ్‌ను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఫార్మా విలేజ్ స్థానంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం పంట తక్కువగా పండే భూములను సేకరించాలని సూచించారు. ఈ విషయంలో రైతులను బలవంతపెట్టవద్దని కోరారు.