డీజిల్ బస్సులే కావాలి : ఆర్టీసీ కార్మిక జేఏసీ
కాలుష్య నివారణకోసం ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు షార్ట్ సర్యూట్తో కాలిపోతున్నాయని, ప్రయాణికుల రక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో డీజిల్ బస్సులే నడుపాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ డిమాండ్ చేసింది.
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : కాలుష్య నివారణకోసం ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు షార్ట్ సర్యూట్తో కాలిపోతున్నాయని, ప్రయాణికుల రక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో డీజిల్ బస్సులే నడుపాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కే యాదయ్య, బీ యాదగిరి ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులు రిపేర్కు పంపినపుడు వాటిల్లో విధులు నిర్వర్తిస్తున్న కండక్టర్లకు డ్యూటీలు వేయకుండా సెలవులు ఇస్తుండటంతో వారు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో డీజిల్ బస్సులు నడుపాలని డిమాండ్ చేశారు.
స్టాప్లు పెంచడంతో బుకింగ్స్ పెరిగాయి : ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, ప్రయాణికుల కోసం కొత్త స్టాప్లను పెంచడంతో బుకింగ్లు పెరిగాయని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు రూట్లో నడిచే పుష్పక్ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ నిర్ణయంతో రోజూ అదనంగా 60 నుంచి 70 టికెట్లు బుక్ అవుతున్నట్టు నాగిరెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

