హైదరాబాద్, జూన్15 (నమ స్తే తెలంగాణ): ఫుడ్సేఫ్టీలో ఇత ర రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలపాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీపై సచివాలయంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ మొ బైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా 200 ఫుడ్ శాంపిల్స్‌ను టెస్ట్ చేయాలని, ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ సూల్స్, బేకరీలు, డెయిరీఫుడ్, రెస్టారెంట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీదారులు లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని తెలిపారు. నాణ్య తా ప్రమాణాలు పాటించని ఫుడ్ వ్యా పారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నివేదికను ప్రతి శనివారం అం దించాలని ఆదేశించారు.