జగిత్యాల : క్రీడాకారులు( Sports Person) ఒలింపిక్స్లో పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తెచ్చే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar ) అన్నారు. పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో శనివారం తెలంగాణ మహిళల ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, ఫైన్ ఆర్ట్స్ ముఖ్యమన్నారు. క్రీడలు ప్రోత్సహించడం ద్వారానే అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం వల్ల విద్య, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పనతో క్రీడలకు ప్రోత్సాహం కలుగుతుందని అన్నారు.
తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వెల్లడించారు. జగిత్యాల నియోజకవర్గంలో క్రీడా మైదానాల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి చేశారు. క్రీడాకారులకు పండ్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు, జగిత్యాల సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సభ్యులు సుధాకర్ , డీవైఎస్వో రవి బాబు, రాజ్ కుమార్ , పురుషోత్తం, అశోక్ రావు , శరత్ రావు, వేణు గోపాల్ మోహన్ వెంకటేష్ యం ఏ ఆరిఫ్ కొలగని సత్యం, తిరుమలయ్య, దుమాల రాజ్ కుమార్ , కోటేశ్వర రావు, బిక్షపతి, శ్రీనివాస్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.