హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యా బిల్లులో కామన్ గురుకుల విద్యా విధానాన్ని చేర్చాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమీకృత గురుకుల విద్యావిధానం స్ఫూర్తితో కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసినప్పుడే గురుకుల విద్యావ్యవస్థలో గుణాత్మకమైన మార్పు వస్తుందని వెల్లడించారు. ఒత్తిడితో పనిచేస్తున్న గురుకుల సిబ్బందికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఐదు సొసైటీల రాష్ట్ర కమిటీ సభ్యులు టీజీపీఏ సెంట్రల్ కమిటీని ఎన్నుకున్నారని వివరించారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ రౌతు అజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పైళ్ల ప్రకాశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శ్రీలత, జాయింట్ సెక్రటరీగా దుర్గారెడ్డి, సురభి చైతన్య, వరింగ్ ప్రెసిడెంట్‌గా, గోపాల్‌రెడ్డి కోశాధికారిగా జకని రాజేశం, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా తనుగుల శ్రీనివాస్, అధికార ప్రతినిధిగా గండ్ర శ్రీకాంత్, కేంద్రీయ కార్యాలయ కార్యదర్శిగా గన్నెబోయిన భిక్షపతి ఎన్నికైనట్టు వెల్లడించారు.