TGCHE | హైదరాబాద్, జనవరి 23 (నమస్తేతెలంగాణ): యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి (TGCHE) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నిధులివ్వకుండా యూజీసీ పెత్తనం చెలాయిస్తున్నదని ఆరోపించారు. ఇష్టానుసారంగా సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేయాలని ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యూజీసీ నిబంధనలు అమల్లోకి వస్తే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల నియామకాల్లో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండబోదని తెలిపారు
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): డబ్బు కోసం అమాయకులను బలి చేస్తున్న సోషల్ ఇన్ఫ్లూయెన్సర్లకు తెలంగాణ పోలీసుశాఖ ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చింది. ఇన్ఫ్లూయెన్స ర్లు ఇల్లీగల్, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమో ట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిం ది. బెట్టింగ్, ట్రేడింగ్ యాప్స్‌ను ప్రమో ట్ చేయడం వల్ల అమాయకులు వాటికి బలవుతున్నారని, భారీగా డబ్బు పోగొట్టుకుంటున్నారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాంటి వాటిపై నిఘా ఉంటుందని పేర్కొన్నది.