ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సింహగర్జన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కులవివక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీలను విభజించేలా ఉన్నదని పేర్కొన్నారు. ఆ తీర్పుతో రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. తమ పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని ప్రకటించారు.
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘కుల వివక్షపై ఆగస్టు1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నాం. ఈ తీర్పు తో రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నది’ అంటూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన మాలలు ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభకు మాలలు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీలకతీతంగా నా యకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు మాజీ జడ్జి చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు ఎస్సీలను విభజించేలా ఉన్నదని తప్పుబట్టారు. కేంద్రానికి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను అమలుచేయాలని డిమాండ్‌చేశారు. రాహుల్‌గాంధీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నార ని, అలా అయితే ఎస్సీ రిజర్వేషన్ కోటాను 20 శాతానికి పెంచాలని కోరారు.
దేశంలో కులవివక్ష ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నదని, పార్లమెంట్లో మాలల గురించి చర్చించాలని డి మాండ్ చేశారు. దళితులను విభజించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారితో మాలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో మాలల సంఖ్య తక్కువ ఉన్నదని కొందరు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాం టి వారికి పెద్దఎత్తున జరిగిన ఈ సభనే సమాధానమని స్పష్టంచేశారు. దేశంలోనే తొలిసారిగా ఇంతమంది ఒక్కచోటికి చేరడం సంతోషదాయకమన్నారు. భారత రాజ్యాంగ నిర్మా త, దళితజన బాంధవుడు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను విమర్శిస్తే సహించబోమని హె చ్చరించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చి సింహగర్జనను విజయవంతం చేసిన మాలలకు ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు. సభలో ఎంపీ లు చిరాగ్ పాశ్వాన్, మల్లు రవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్, మేడిపల్లి సత్యం, నాయకులు మం దాల భాస్కర్, నాగరాజు, శంకర్రావు, రేం జర్ల రాజేశ్, చెరుకు రాంచందర్, డాక్టర్ గోపీనాథ్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.