హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): మంత్రి పొన్నం ప్రభాకర్ యాష్(బూడిద)ను అక్రమంగా తరలిస్తూ కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర నేత పల్లె లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.
శనివారం గాంధీ భవన్లో వారు మాట్లాడుతూ.. ఒకేసారి 70 టన్నుల యాష్ సరఫరా చేసే లారీలు దేశంలోనే లేవని, ఆరోపణలు చేసేముందు అవగాహనతో మాట్లాడాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్కను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.