గవర్నర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం
తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది.
- ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- అమీర్ అలీఖాన్, అజహరుద్దీన్ పిటిషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ నియామకాలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహ తా ధర్మాసనం విచారించింది. ఈ కేసు లో తాము ఇప్పటికే ప్రకటించిన విధంగా జూలై 22న పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో భాగంగా అమీర్ అలీఖాన్, అజారుద్దీన్లు సుప్రీంకోర్టులో ఇంటర్ లొకేటరీ అప్లికేషన్లు (ఐఏ) దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. గవర్నర్ నిర్ణయాన్ని తామేమీ తప్పుపట్టడం లేదని పేరొన్న ది.
ఆ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పష్టం చేశారు. విచారణ ముగిసే సమయంలో అమీర్ అలీఖాన్ తరపు న్యాయవాది మరో అంశాన్ని కోర్టు ముందుకు తెచ్చారు. గతంలో తన క్లయింట్ (అమీర్ అలీఖాన్) పేరును గవర్నర్‌కు సూచించి ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎమ్మెల్సీల నియామకాలు మంత్రివర్గ నిర్ణయ ం ప్రకారం జరుగుతాయని, క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలపై గవర్నర్ మాత్రం ఏం చేయగలరని వ్యాఖ్యానించింది. అమీర్ అలీఖాన్, అజారుద్దీన్ దాఖ లు చేసిన రెండు అప్లికేషన్లను వేరుగా కాకుండా, ప్రస్తుతం పెం డింగ్‌లో ఉన్న ప్రధాన కేసుతోపాటే కలిపి విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

