హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వయనాడ్ ముంపు ప్రాంతాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దాదాపు 416 మంది ప్రాణనష్టం జరిగిందని, అందులో 47మంది సీపీఐ నాయకులను కోల్పోయినట్టు చెప్పారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.వయనాడ్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్శనలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయికుమార్, నాయకులు సాధిక్, అయ్యప్ప, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీకే మూర్తి, సీపీఐ వయనాడ్ జిల్లా కార్యదర్శి, ఐఏఎల్ రాష్ట్ర సభ్యుడు ఈ జే బాబు, ఏబీ చరియన్ తదితరులు పాల్గొన్నారు.