జోగులాంబ గద్వాల : జిల్లా కలెక్టరేట్లో సాగునీటి పారుదల, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో ప్రజలు 100% కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, కలెక్టర్ వల్లూరు క్రాంతి, జడ్పీ చైర్పర్సన్ సరిత గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి , అబ్రహం, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, ఇరిగేషన్ ఈఈల , డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Manny Pacquiao | బాక్సింగ్‌కు గుడ్‌బై.. దేశాధ్యక్ష పదవిపై గురి
Heavy Rains | కందకుర్తిని ముంచెత్తిన వరద నీరు
దీక్షిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మంత్రి సత్యవతి