కమాన్‌పూర్, మార్చి 12: కమాన్పూర్తోపాటు రామగిరి, మంథని, ముత్తారం మండలాలకు కల్పతరువుగా ఉన్న ఈ రిజర్వాయర్‌లో సోమవారం నాటికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయని ‘నమస్తేతెలంగాణ’ ప్రధాన సంచికలో ‘డెడ్ స్టోరేజీకి గుండారం రిజర్వాయర్’ శీర్షికన మంగళవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
ఈ కథనానికి స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం గుండారం రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నీటిని నింపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీ-86 కాలువకు వెళ్లే నీటి సరఫరా నిలిపివేసి ప్రత్యేకంగా గుండారం రిజర్వాయర్ కోసం డీ-83 కెనాల్‌కు మళ్లించి సాగునీటిని వదిలారు. ప్రస్తుతం గుండారం రిజర్వాయర్‌లో 10 ఫీట్లకు పైగా నీటి మట్టం చేరుకొన్నది.