176 గ్రామాలకు అందని తాగునీరు
రాష్ట్రంలో వేసవి ఎండలు క్రమంగా పెరుగుతుంటే మరోవైపు తాగునీరు అందక పలు గ్రామాలు అల్లాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో మంగళవారం నాటికి 176 గ్రామాలకు తాగునీరు అందడం లేదు.
- పనిచేయని 661 బోర్లు, 620 పంపులు
- తాగునీరు క్లోరినేషన్ కాని గ్రామాలు 64
- ఆన్లైన్ డాటా వెల్లడించిన అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేసవి ఎండలు క్రమంగా పెరుగుతుంటే మరోవైపు తాగునీరు అందక పలు గ్రామాలు అల్లాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో మంగళవారం నాటికి 176 గ్రామాలకు తాగునీరు అందడం లేదు. వివిధ ప్రాంతాల్లో 661 బోర్లు, 620 చేతిపంపులు పనిచేయడం లేదు. 64 గ్రామాల్లో మంగళవారం తాగునీరు క్లోరినేషన్ కాలేదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,608 గ్రామాల తాగునీటి సరఫరా డాటాను ఆన్లైన్లో నమోదు చేశారు. వీటిలో 10,432 గ్రామాలకు సమృద్ధిగా తాగునీరు అందుతున్నదని, తాతాలిక సమస్యల కారణంగా 176 గ్రామాలకు నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. మంత్రి సీతక ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ‘సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్’ ప్రారంభమైందని, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ డ్రైవ్ కొనసాగుతున్నదని తెలిపారు.
సరఫరాపై రోజువారీ సమీక్ష: మంత్రి
రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై రోజువారీగా సమీక్షిస్తున్నట్టు మంత్రి సీతక్క మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలవారీగా ఎన్ని గ్రామాలకు తాగునీరు సమృద్ధిగా అందుతున్నది? తాతాలిక సమస్యలతో ఎన్ని గ్రామలకు నీళ్లు అండడం లేదు? వాటిని ఎన్ని రోజుల్లో పరిషరించవచ్చు? అనే అంశాలపై రోజు నివేదికలు తెప్పించుకుని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇస్తున్నట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

