Bandaru Dattatraya : హైదరాబాద్ వాసి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ రాంనగర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చి సిరా గుర్తును చూపించారు.
లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఇవాళ తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకే 40 శాతం పోలింగ్ నమోదైంది.