నెల్లికుదురు, అక్టోబర్ 17: గ్రూపు రాజకీయాలకు తెరలేపేవారిని గ్రామ పొలిమేర దాటనివ్వమని ఎమ్మెల్యే మురళీనాయక్‌ను సొంత పార్టీ నేతలు హెచ్చరించారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో సీనియర్ నేతలను విస్మరించడా న్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రంలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదళ్ల యాదవరెడ్డి, మాజీ జీడ్పీటీసీ హెచ్ వెంకటేశ్వర్లు, పార్టీ మండలాధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్‌గౌడ్ సమావేశం ఏర్పాటు చేశా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వా లో తెలియనిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని విమర్శించారు. ఇండ్లలో కూర్చొని ఇందిరమ్మ కమిటీలు వేస్తే ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.