హైదరాబాద్, నవంబర్ 10, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమం నాటి కేసులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాసర్కు ఊరట లభించింది.
ఆ కేసులో ఆయనతోపాటు 18 మందికి నెల రోజుల జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం తీర్పు వెలువరించారు.