గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 21:30:56

అప్లికేషన్‌ ఆవిష్కరణతో ఫేస్‌బుక్‌లో ఉద్యోగం

  అప్లికేషన్‌ ఆవిష్కరణతో ఫేస్‌బుక్‌లో   ఉద్యోగం

మట్టెవాడ: వరంగల్‌ నగరానికి చెందిన గందె అజిత్‌ కుమార్‌ అమెరికాలో జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేశారు.  ప్రముఖ టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించారు. ‘క్లౌడ్‌ మోడిఫికేషన్‌ ఆఫ్‌ మాడ్యులార్‌ అప్లికేషన్‌ రన్నింగ్‌ ఇన్‌ లోకల్‌ డివైజెస్‌' అనే సరికొత్త అప్లికేషన్‌ ఆవిష్కరించి పేటెంట్‌ను సైతం సాధించారు. అజిత్‌ కుమార్‌ మైక్రోసాఫ్ట్‌లో పలు విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి మేనేజ్‌మెంట్‌ ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో తాను ఆవిష్కరించిన అప్లికేషన్‌ నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని అజిత్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 


logo