సుబేదారి, జనవరి29: వరంగల్‌కు చెందిన మహమ్మద్ జక్రియా ను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా అతడిని అరెస్టు చేశారు. జక్రియాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఇంటలిజెన్స్ సమాచారంతో 25న చెన్నై ఎయిర్‌పోర్టులో అతడిని పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సిరిపురం నుంచి 30 ఏండ్ల క్రితం వరంగల్‌కు వలసొచ్చిన జక్రియా.. జాన్‌పాక ఆదర్శనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. స్థానికంగా రెండు బిర్యానీ సెంటర్లు నడిపించడంతో పాటు మత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు. జక్రియా వరంగల్ వాసి కావడంతో నగరంలో అతడి కార్యకలాపాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు.