సుబేదారి, అక్టోబర్ 10 : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు పల్లె రాహుల్‌రెడ్డి పోలీసు స్టేషన్లో ఒకరిపై దౌర్జన్యం చేశాడు. పత్రికల్లో రాయలేని విధంగా బూతులు తిడుతూ ఒక వ్యక్తి కడుపులో, చెంపపై పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్లో జరిగింది.
విశ్వనీయ సమాచారం ప్రకారం.. హనుమకొండకు చెందిన సూర్యకిరణ్, ఆత్మకూరుకు చెందిన గౌని శ్రీకాంత్ మధ్య అప్పు గొడవ నడుస్తున్నది. ఈ వ్యవహారం కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఎస్సై చాంబర్ ముందు నిలబడ్డాడు. అక్కడికి వచ్చిన రాహుల్‌రెడ్డి.. శ్రీకాంత్ వద్దకు వచ్చి బూతులు తిడుతూ దాడి చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేసినా రాహుల్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.