హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): లడక్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ అరెస్టు అక్రమమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన అరెస్టును తాను ఖండిస్తున్నట్టు శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. సోనమ్ వాంగ్చుక్ తాను నమ్మే దానికోసం నిలబడే దేశభక్తి గల పౌరుడని, అలాంటి వ్యక్తిని చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని విమర్శించారు. ప్రభుత్వ కఠిన చర్యలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో మన హక్కు అని, అలా ప్రశ్నించేవారిని పాలకులు అరెస్టు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.