వనపర్తి, మార్చి 7 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి బీరం సుబ్బారెడ్డిని కలెక్టర్ శుక్రవారం సస్పెండ్ చేశారు. సుబ్బారెడ్డి బీసీ వెల్ఫేర్ నిధులు పక్కదారి పట్టించారని విద్యార్థి, కుల సంఘాలు కలెక్టర్‌తోపాటు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును విచారణ అధికారిగా నియమించారు.
విచారణలో అవినీతి జరిగిందన్న రిపోర్టు ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కార్పొరేషన్ ఖాతాలో ఉన్న నిధులను దుర్వినియోగం చేశారని, సిబ్బందితో పనులు చేయించుకున్నాడన్న ఫిర్యాదులూ వచ్చాయి. 2022 జూన్‌లో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిగా వచ్చిన ఆయన ఇన్చార్జి బీసీ వెల్ఫేర్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. 3నెలల క్రితం ఎక్సైజ్ సూపరింటెండెంట్ వినయ్ప్రభు, సివిల్ సప్లయి డీఎం ఇర్ఫాన్ సైతం ఇక్కడ పని చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు.