విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన సవరణను అమలు చేస్తూ, ఇతర భత్యాలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం(టీఆర్వీకేఎస్) నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం విద్యుత్తు సౌధలోని వేతన సవరణ కమిటీ కన్వీనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
కన్వీనర్‌ను కలిసిన వారిలో టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్, ప్రతినిధులు చారుగుండ్ల రమేశ్, కమలాకర్‌రావు, శ్రీధర్‌గౌడ్,టీఎస్ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, కార్యదర్శి కరెంటురావు తదితరులు ఉన్నారు.