Voter Card | ఓటర్ కార్డుపై మీ ఫొటో లేదా.. నో టెన్షన్.. గుడ్‌న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం
Voter Card | ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లందరికీ నవంబర్ 25కల్లా ఓటరు సమాచార స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఫొటోతో ఉన్న ఓటరు కార్డు లేదా మరో 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని పోలింగ్‌స్టేషన్‌కు తీసుకురావాలని సూచించింది.
Voter Card | హైదరాబాద్, అక్టోబరు 25 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లందరికీ నవంబర్ 25కల్లా ఓటరు సమాచార స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఫొటోతో ఉన్న ఓటరు కార్డు లేదా మరో 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని పోలింగ్‌స్టేషన్‌కు తీసుకురావాలని సూచించింది. ఓటరు తన పోలింగ్ స్టేషన్‌ను, ఓటర్ల జాబితాలోని తన క్రమ సంఖ్యను, పోలింగ్ తేదీ, సమయం వివరాలను తెలుసుకోవడానికి వీలుగా ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ జారీ చేస్తామని వివరించింది. భారత పాస్‌పోర్ట్‌లోని వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో నమోదైన ప్రవాస ఓటర్లను ఓటింగ్‌కు అనుమతించాలని పేర్కొన్నది. పోలింగ్ స్టేషన్లో వారి పాస్‌పోర్ట్ ఆధారంగానే ఓటు హక్కు గుర్తించాల్సి ఉంటుందని, దీనికి ఇతర ఏ గుర్తింపు పత్రం పరిశీలించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
ఆ 12 కార్డులు ఇవే..
ఇందులో ఆధార్‌కార్డ్ , మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ (ఫొటోతో ఉన్నవి) పాస్‌బుక్‌లు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, జాతీయ జనాభా రిజిస్టరు జారీ చేసిన స్మార్ట్‌కార్డ్, భారత పాస్‌పోర్ట్, ఫొటోతో ఉన్న పింఛను పత్రం, ఉద్యోగులకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ప్రభుత్వ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫొటోగుర్తింపు కార్డులు, చట్ట సభల సభ్యత్వాన్ని చూపే అధికారిక గుర్తింపు కార్డులు, దివ్యాంగుల గుర్తింపు కార్డులు చూపించవచ్చని వివరించింది. ఏదైనా గుర్తింపు కార్డులో దొర్లిన చిన్న చిన్న అక్షర దోషాలను అధికారులు పట్టించుకోవద్దని ఎన్నికల సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

