Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
Former Minister Talasani | అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఎన్నికల కమిషన్ అధికారులే ఓటరుగా నమోదు చేయించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఎన్నికల కమిషన్ అధికారులే ఓటరుగా నమోదు చేయించాలని( Voter registration) మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Former Minister Talasani ) డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం లో జాప్యం, ఎన్నికల కమిషన్ బాధ్యతలను విస్మరించడం తదితర అంశాలపై మాజీ మంత్రి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం బిఆర్కె భవన్ లో ఎన్నికల కమిషన్ సీఈవో( CEO ) సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ లు దాసోజు శ్రవణ్, సురభి వాణి దేవి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమం ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరగాలని స్పష్టం చేశారు.
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమానికి నవంబర్ 6 తో గడువు ముగియనున్న ఇప్పటి వరకు బీఎల్వో లను నియమించలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమన్వయం తో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని వివరించారు. ఓటరుగా నమోదు చేసుకోవాలనే విషయంలో ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం వారి బాధ్యత రాహిత్యాన్ని స్పష్టం చేస్తుందని చెప్పారు.
గత గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటు వేసిన వారు కూడా తిరిగి ఓటరు గా నమోదు చేసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్ అధికారుల వద్ద సమాధానం లేదని ఆరోపించారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికలలో హైదరాబాద్ నగర పరిధిలో ఒక లక్ష 10 వేల మంది ఓటర్లు నమోదు కాగా, ప్రస్తుతం ఇప్పటి వరకు 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఎన్నికల కమిషన్ అధికారులు తెలపడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో 5.27 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు తప్ప, వాటి వెరిఫికేషన్ ప్రారంభించలేదని అన్నారు.
గ్రాడ్యుయేట్ లు ఈ దేశ పౌరులు కాదన్నట్లుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను విస్మరించడంతో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కష్టపడి గ్రాడ్యుయేట్ ల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని అందజేసేందుకు అధికారుల వద్దకు వెళితే దరఖాస్తు దారులే రావాలని, బల్క్ లో దరఖాస్తులు తీసుకోమని అభ్యంతరాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కోలేటి దామోదర్ గుప్త, మన్నె క్రిశాంక్, గజ్జెల నగేష్, నియోజకవర్గ పార్టీ ఇంఛార్జీలు ఆనంద్ గౌడ్, మాగంటి సునీత, ఆజామ్, సలా ఉద్దీన్ లోది, ఓటరు నమోదు కార్యక్రమం ఇంఛార్జి లు గోసుల శ్రీనివాస్ యాదవ్, వెంకట్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మస్కతి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

