హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో నూతన ఓటర్ల నమోదు శాతం ఆశించినస్థాయిలో లేకపోవడం, నోటీసులకు ఓటర్ల స్పందన తక్కువగా ఉండటం పట్ల టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవడంలో వెనుకబడిఉన్నారని, జాబితా పరిశీలనలో అధికారులు జారీచేసిన నోటీసులకు సమయానికి స్పందించకపోవడం వల్ల వేలాదిమంది అర్హులైన పౌరులు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తక్షణమే ఫామ్-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.