హైదరాబాద్, ఏప్రిల్27 (నమస్తే తెలంగాణ): త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల జాబితాను సవరించేందుకు భారత ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయని పే ర్కొన్నారు.
ప్రస్తుతమున్న ఓటర్ల జాబితాలో తరచూ జరిగే వలసలతో ఓటర్లు ఒకటి కంటే ఎకువ చోట్ల పేరు నమో దు చేసుకోవడం, మరణించిన ఓటర్ల పేర్లు తొలగించకపోవడం వల్ల సమస్య లు ఏర్పడ్డాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని స్పష్టంచేశారు.
రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్ల వివరాలను 2002లో జరిగిన చివరి ఎస్ఐఆర్లో ఉన్న వారి పేర్లు, లేదా వారి బంధువుల పేర్లతో సరిపోల్చే ప్ర క్రియను బీఎల్వో, ఏఈఆర్వోలు, ఈఆర్వోలు నిర్వహిస్తారని వెల్లడించారు. 2002 సర్ ఓటర్ల జాబితాలను తెలంగాణ ఎన్నికల అధికారి అధికారిక వెబ్సైట్<https:// ceotelangana. nic.in> , <https://voters.eci. gov.in> లో పోలింగ్‌స్టేషన్ వారీగా అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఆ జాబితాలో తమ పేరు లేకపోతే వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేసుకోవాలని సూచించారు.