చండ్రుగొండ/ దమ్మపేట రూరల్/ తిరుమలాయపాలెం, మే 24 : తమకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందేనని వీవోఏలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసనలను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జి ల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కనీస వేతనం, వేతన చట్టం అమలు, ఉద్యోగభద్రత, బీమా సౌకర్యం, ఉద్యోగోన్నతులు, తదితర డిమాండ్లతో కొన్ని రోజులుగా వీవోఏలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
తిరుమలాయపాలెంలోని రిలే నిరాహార దీక్షా శిబిరంలో వీవోఏల సంఘం మండల నాయకురాలు పొలిశెట్టి అరుణ అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. వెంటనే తోటి వీవోఏలు ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు వేల్పుల సుశీల మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల వీవోఏల ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.