హనుమకొండ, సెప్టెంబర్ 9: బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ విచారణ చేసి త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగిందని, సుదీర్ఘ చర్చల అనంతరం కోర్టు నాలుగు వారాల లోపు ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించిందని తెలిపారు. స్పీకర్ గడ్డం వెంటనే స్పందించి 4 వారాల్లోపు చర్యలు తీసుకోవాలని, లేకుంటే హైకోర్టు మళ్లీ జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.