హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అసంఘితరంగ కార్మికుల కుటుంబాలకు విద్య, వైద్య, సంక్షేమ పథకాలను ఉచితంగా అందిస్తున్నామని కేంద్రకార్మికశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ త్రివేదీ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీడీ, సినీ, బోగ్గు గని కార్మికులకు పథకాలు వర్తింపచేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ, ఏపీలోని 4.5 లక్షల మంది బీడీ కార్మికులు, 16వేల మంది సినీ కార్మికులు, 26వేల మంది బొగ్గుగని కార్మికులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. రెండు రాష్ర్టాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4,500 మంది విద్యార్థులకు రూ.3.55 కోట్ల స్కాలర్షిప్లు మంజూరు చేశామని తెలిపారు. 26 డిస్పెన్సరీల ద్వారా 1.35లక్షల మందికి ఉచిత వైద్యం అందించినట్టు వివరించారు.