మద్దూరు (ధూళిమిట్ట) : సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లిలో జైన చౌముఖి శిల్పం లభించినట్టు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని అంగడి వీరన్న ఆలయం సమీపంలో విగ్రహం ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు దీన్ని వెలికితీశారు.
10వ శతాబ్దానికి చెందిన చాళుక్యుల కాలం నాటి సర్వతోభద్ర విగ్రహంగా చరిత్రకారులు గుర్తించారు.