ఆదిలాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇలాంటి తరహా కూల్చివేతలకు పలు జిల్లాల్లో అధికారులు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్(Adilabad) పట్టణంలోని ఖానాపూర్ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని గుర్తించడానికి మున్సిపల్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.
నంబర్లు వేయవద్దంటూ అధికారులను నిలదీశారు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడ నివసిస్తున్న తమను ఆక్రమణల పేరుతో ఆగం చేయొద్దని అధికారులను అడ్డుకున్నారు. స్థానికుల ఆందోళనతో చేసేదిమిలేక మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్ నగరంలోని మూసీ నది పరివాహక (Musi River) ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది.
ఆపరేషన్ మూసీ పేరుతో తమ ఇండ్లకు మార్కింగ్ చేయడంపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు. మూసీ సుందరీకరణకోసం తమ బతుకులను ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడితున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాటపట్టారు.