హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలని స్వగ్రామం చింతమడకవాసులు బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావును ఆహ్వానించారు. శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ సీనియర్ నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు ఆధ్వర్యంలో గ్రామపెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కేసీఆర్‌ను ఆహ్వానించినవారిలో గ్రామ పెద్దలు రామాగౌడ్, హంసకేతన్‌రెడ్డి, మల్లుపల్లి పోశయ్య, సత్యనారాయణగౌడ్, శేఖర్ తదితరులున్నారు.