గ్రామాన్నే పట్టా చేసిండ్రు
అమ్మిన వ్యక్తే తిరిగి పట్టా చేసుకుండు
అధికారుల నిర్వాకంతో ఆదివాసీలకు ఇక్కట్లు

పెంబి: ఓ వ్యక్తి దురాలోచన.. అధికారుల నిర్వాకం ఓ ఊరినే ముంచింది. అమ్మిన భూమిని గ్రామస్థులకు తెలియకుండా తిరిగి పట్టా చేసుకోవడంతో ఆదివాసీలు అయోమయంలో పడిపోయారు. నిర్మల్ జిల్లా పెంబి అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు పెంబికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన మందపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద 55/2 సర్వే నంబర్లో ఏడెకరాల అసైన్డ్‌భూమిని కొనుగోలు చేసి, 2000 సంవత్సరంలో కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు అప్పటి మంత్రి, ప్రస్తుత టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి చొరవచూపారు. సుమారు 50 కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. వేణుగోపాలాచారి సహాయానికి గుర్తుగా వారు తమ గ్రామానికి ‘వేణునగర్’గా నామకరణం చేసుకున్నారు. ఆ తర్వాత 2002లో పెంబికి చెందిన గన్నారపు సురేందర్ ఆదివాసీలకు తెలియకుండా, వారు భూమి కొన్న వ్యక్తుల నుంచి 4.34 ఎకరాలను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని, అసైన్డ్ భూమిని పట్టాభూమిగా మార్చుకున్నాడు. గ్రామంలో మొత్తం భూమి తనదేనంటూ సురేందర్ ఇటీవల గ్రామస్థులతో చెప్పడంతో వారు కంగుతిన్నారు. నివాస స్థలాలను తన భూమిగా పట్టా చేసుకొని దానిపై ఏడాదికి రూ.47,500 రైతుబంధు పొందడం గమనార్హం. నివాస స్థలాలపై డబ్బులు సదరు రైతు ఖాతాలో జమ అవుతున్నా కనీసం వ్యవసాయ అధికారులు గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఈ విషయంపై గ్రామస్థులు శనివారం తాసిల్దార్ రాజ్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- seller
- village Return
- villages
RELATED ARTICLES
తాజా వార్తలు
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

