మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఎన్నికల సంఘం నియమావళిర్ ప్రకారం అధికారికంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారాయన. ర్యాండమ్‌గా 5 ఈవీఎంల వీవీ ఫ్యాట్లను లెక్కించి సరిచూసుకుంటామని, ఎక్కడ పక్షపాతానికి తావివ్వకుండా ఎన్నికల ప్రక్రియను ముగించామని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
మా సంఘంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ప్రొసీజర్ ప్రకారం మా విధులు మేము నిర్వర్తించామని, వ్యక్తిగత తప్పిదం వల్లనే మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌పై వేటు పడిందని స్పష్టం చేశారు. దేశం మొత్తం దృష్టి సారించిన మునుగోడు ఉపఎన్నికని విజయవంతంగా ముగించామన్నారు. ఎన్నికల సిబ్బందికి సహకరించిన వాళ్లకి అభినందలు తెలిపిన ఆయన మునుగోడులో ఎలక్షన్ కోడ్ నవంబర్ 8న ముగుస్తుందని వివరించారు.