హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వీరిద్దరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తన భార్య, వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీతరెడ్డితో కలిసి మొదట గాంధీభవన్‌కు చేరుకొని పార్టీలో చేరారు.
అనంతరం సునీతరెడ్డి శాసససభా ప్రాంగణానికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. మరోవైపు విద్యాసంస్థల అధినేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (సినీ హీరో అల్లు అర్జున్ మామ) కూడా శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. శాసనసభ ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కలిసి తాను కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా శుక్రవారం అసెంబ్లీకి వచ్చి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి తనకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాజయ్య చెప్పారు.