Vijayashanti | కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతిని ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్ఠానం ఖరారు చేసింది. విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కూడా అభ్యర్థులుగా ఖరారు చేసింది. మొత్తం నాలుగు స్థానాల్లో మిగిలిన ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఈ మేరకు వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివరాలను ప్రకటించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆయా స్థానాలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్‌డ్రాకు 13 వరకు అవకాశం ఉంది. 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా మూడు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్కు వస్తాయి. ఐదో స్థానం కోసం ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌కు నాలుగో సీటు లభించే అవకావమున్నా.. సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.