హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : విజ్ఞాన్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం, వర్సిటీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మూడవ, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మొదటి స్నాతకోత్సవాలను ఆగస్టు 2, 3 తేదీల్లో సంయుక్తంగా నిర్వహించనున్నట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నాగభూషణ్ తెలిపారు.
గురువారం ఏపీలోని వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2న జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, గౌరవ అతిథులుగా హైదరాబాద్‌లోని ఐల్యాబ్స్ గ్రూప్ ఫౌండర్ చింతలపాటి శ్రీనివాసరాజు, జెన్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ అట్లూరి, లిటిల్ మ్యూజీసియన్స్ అకాడమీ ఫౌండర్ కొమండూరి రామాచారి, 3న జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఐఎం రాయ్‌పూర్ మాజీ డైరెక్టర్ రామ్‌కుమార్ కాకాని, గౌరవ అతిథిగా విజయవాడలోని ఆర్ఆర్ స్పోర్ట్స్ ఫౌండర్ గల్లా రాధారాణి హాజరుకానున్నట్టు తెలిపారు.
స్నాతకోత్సవాల సందర్భంగా 3వేల మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు, వివిధ రంగాల్లో సేవలందించిన నలుగురికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు.