ఉస్మానియా యూనివర్సిటీ: తార్నాకలోని తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ (తెలంగాణ రాష్ట్ర రాజ్యాభిలేఖన పరిశోధనాలయం)లో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఆర్కైవ్స్‌లో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై మీడియాలో పలు కథనాలు వచ్చి న నేపథ్యంలో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది.
ఉదయమే అక్కడికి చేరుకున్న అధికారులు గేట్లు మూసివేసి తనిఖీలు చేపట్టారు. రాకపోకలు నిలిపివేసి ఆధారాల కోసం అన్వేషించారు. తనిఖీల్లో దొరికిన ఆధారాలు, అందులో పాత్రధారులైన అవినీతి ఉద్యోగుల వివరాలు బహిర్గతం కావాల్సి ఉన్నది.