హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో ఫీజు వివరాలు, ైస్టెపెండ్ తదితర అంశాల గురించి ఆరా తీశారు. దీంతోపాటు సీట్ల సంఖ్య, సిబ్బంది జీతభత్యాలు, మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న దవాఖానలో జరిగిన ఆపరేషన్లు, డెలివరీల వివరాలను సైతం సేకరించారు. ఇటీవల పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విష యం తెలిసిందే. దీనిలోభాగంగా తాజాగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
రిజిస్టర్డ్ పోస్టు సేవలు స్పీడ్ పోస్టులో విలీనం ; అధికారులకు తపాలాశాఖ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ): రిజిస్టర్డ్ పోస్టు సేవలను స్పీడ్ పోస్టు సేవల్లో విలీనం చేస్తున్న ట్టు తపాలా శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఈ సేవలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నా యి. ఇప్పటివరకు కొనసాగిన రిజిస్ట ర్డ్డ్ పోస్ట్ ఫార్మెట్లను మార్చుకోవడంతోపాటు పాలనాపరమైన మార్పు లు, చేర్పులు 31లోగా పూర్తిచేయాలని అధికారులకు తపాలా శాఖ ఆదేశాలు జారీ చేసింది.