హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా కే విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్(ఎస్ఎస్ అండ్ ఎల్ఆర్) విభాగంలో చీఫ్ సెక్రటరీ ఓఎస్డీ, జాయింట్ డైరెక్టర్(అడ్మిన్)గా ఉన్న ఆయన్ను ప్రభుత్వం తాజాగా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీగా నియమించింది.