హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేసినట్టు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ లీగల్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో రూ.40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా, రూ.70 ఖర్చు చేసినట్టు ప్రకటించడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ భరత్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిరుమల్ల రాకేశ్, నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు.