నర్సాపూర్/కౌడిపల్లి, డిసెంబర్ 25: భారత ఆర్థిక వ్యవస్థలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే దేశం పురోభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రకృతి, సేంద్రియ రైతుల సమ్మేళనానికి ఉపరాష్ట్రపతి సతీమణి డాక్టర్ సుదేశి ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.