హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘ఇప్పుడు మీటింగులకు బాగానే వస్తరు.. కానీ ఎన్నికలప్పుడు మా త్రం వీళ్లెవరూ కనిపించరు’ అని పాతబస్తీ శ్రే ణులపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. గాంధీభవన్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జీలు దీపాదాస్ మున్షి, విష్ణునాథ్, ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. కొందరు పార్టీ శ్రేణు లు సమావేశాలకు ఊరేగింపుగా వచ్చి హంగా మా చేస్తారు కానీ, ఎన్నికల సమయంలో మాత్రం ఎవరూ కనిపించరని, మజ్లిస్ పార్టీకే ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో అక్కడే ఉన్న పాతబస్తీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తన కుమారుడికి రాజ్యసభ ఇచ్చినంత మాత్రాన తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.