సుల్తాన్‌బజార్, జనవరి 20: అయో ధ్య రామమందిరంలో రామ్‌లల్లా విగ్ర హ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యం లో సోమవారం సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సహకార కార్యదర్శి భానుప్రసాద్, సంపర్క్ ప్ర ముఖ్ వెంకేటశ్వరరాజు తదితరులు డిమాండ్ చేశారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో శనివారం సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి ఓఎస్డీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి హిందువుల మ నోభావాలను గౌరవిస్తూ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం హాఫ్‌డే సెలవు ప్రకటించగా, అనేక రాష్ర్టాలు సెలవు దినంగా ప్రకటించాయని అన్నారు.